విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శనివారం ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. ఎం. మోహన్ బాబు మాట్లాడుతూ* .. ‘ఆ పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితోనే ఈ చిత్రాన్ని తీశాం. ఈ మూవీలోని ప్రతీ పాత్ర హీరోలానే ఉంటుంది. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. నేను మహా భారతం సీరియల్‌ని ఎన్నో సార్లు చూశాను. ‘కన్నప్ప’ సినిమాను ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. తల్లీతండ్రి తప్ప మరో దైవం లేరని చెప్పేవాడు తిన్నడు. ఆ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడన్నదే ఈ కథ. ఆకెళ్ల ఈ చిత్రానికి అద్భుతమైన మాటలు అందించారు. ఆ శివుడి ఆశీస్సులతో మే 27న రాబోతోన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు!!
