Sunday, June 1, 2025

Top 5 This Week

Related Posts

దండుపాళ్యం, కాంతారా” కోవలో తెలుగులో త్వరలో విడుదల కానున్న కన్నడ బ్లాక్ బస్టర్ “డేంజర్ బాయ్స్

కన్నడలో అనూహ్య విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపించిన “అపాయవీడి హెచ్చరిక” చిత్రం “డేంజర్ బాయ్స్” పేరుతో తెలుగు ప్రేక్షకులను సైతం ఉర్రూతలూగించేందుకు సన్నద్ధమవుతోంది. యశశ్విని క్రియేషన్స్ – గీతా ఫిలిమ్స్ పతాకలపై శ్రీరంగం సతీష్ కుమార్ సమర్పణలో… వి.జి.మంజునాథ్ – పూర్ణిమ ఎమ్.గౌడ్ నిర్మించిన ఈ చిత్రానికి రచన -దర్శకత్వం: అభిజిత్ తీర్ధహళ్లి!!వికాస్ ఉత్తయ్య, రాధా భగవతి, అశ్విన్ హసన్, రాఘవ్ కొడబాద్రి, మిథున్ తీర్ధహళ్లి ముఖ్య తారాగణంగా విజయ దుందుభి మ్రోగించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి సంగీత దర్శకుడు – ఛాయాగ్రాహకుడు ఒక్కరే కావడం గమనార్హం. సునాద్ గౌతమ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ “డేంజర్ బాయ్స్” చిత్ర సంచలన విజయంలో సముచిత పాత్ర పోషించాయి. “దండుపాళ్యం, కాంతారా” తదితర చిత్రాల కోవలో… కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగులోనూ అదే స్థాయి విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర సమర్పకులు – ప్రముఖ దర్శకనిర్మాత శ్రీరంగం సతీష్ కుమార్ పేర్కొన్నారు. జూన్ ద్వితీయార్థంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న “డేంజర్ బాయ్స్” ప్రి-రిలీజ్ వేడుక జూన్ 1న భారీ స్థాయిలో జరగనుంది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles