ఇండియన్ సినిమా లెజెండ్స్ రజనీకాంత్, కమల్ హాసన్, రెడ్ జెయింట్ మూవీస్, నెల్సన్ దిలీప్ కుమార్ ప్రతిష్టాత్మక చిత్ర ప్రోమో రిలీజ్
ఇండియన్ సినిమా లెజెండ్స్ గా కోట్లాది మంది ప్రేక్షకుల ప్రేమను సంపాదించుకున్నారు రజనీకాంత్, కమల్ హాసన్. వీరు కలిసి నటించే సినిమా కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆ మోస్ట్ అవేటెడ్ సినిమాను మన ముందుకు తీసుకురాబోతోంది ప్రెస్టీజియస్ బ్యానర్ రెడ్ జెయింట్ మూవీస్. 47 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కాంబోలో భారీ పాన్ వరల్డ్ మూవీని నిర్మిస్తోందీ సంస్థ. “KHxRK”వర్కింగ్ టైటిల్ తో ఈ అరుదైన చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ అనౌన్స్ చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.
ఈ రోజు ఈ హిస్టారిక్ మూవీ ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమోలో రజనీకాంత్, కమల్ హాసన్ పోటా పోటీగా సన్నద్ధమవడం ఆసక్తి కలిగిస్తోంది. ఒకరు సెలెక్ట్ చేసుకున్న సూట్ మరొకరు వద్దనడం, ఒకరు ఎంపిక చేసుకున్న షూస్ మరొకరు రిజెక్ట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రోమో చివరలో హీరో ఎవరు అని డైరెక్టర్ ను క్వశ్చన్ చేయడం ఫన్ క్రియేట్ చేస్తోంది. ప్రోమోకు అనిరుధ్ ఇచ్చిన బీజీఎం హైలైట్ గా నిలుస్తోంది. ప్రోమోలో కమల్, రజనీ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.
ఇండియన్ సినిమా లెజెండ్స్ రజనీకాంత్, కమల్ హాసన్ చిత్ర ప్రోమో రిలీజ్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
