పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకులు. ఎం.ఎం. కీరవాణి సంగీత సారధి. నిధి అగర్వాల్ కథానాయిక. బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ త్వరలో విడుదల కాబోతుంది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఫ్రెష్ విడుదల తేదీని కూడా నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది!!
