ముమ్మాటికీ మే 9న వస్తాం” అని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించి ఇంకా మూడు రోజులు కాలేదు. అంతలోనే “హరిహర వీరమల్లు” విడుదల తేదీపై అనుమానపు మబ్బులు ముసురుకుంటున్నాయి.
శ్రీ విష్ణు నటిస్తున్న “సింగిల్” చిత్రం మే 9 విడుదల అని ప్రకటించడమే అందుకు కారణం. పవన్ కళ్యాణ్ సినిమాతో.. శ్రీవిష్ణు సినిమా ఢీ కొట్టే సాహసం చేస్తుందా? ఒకవేళ చేసినా… ఒక్క థియేటరంటే ఒక్క థియేటర్ అయినా శ్రీవిష్ణు సినిమాకు దొరుకుతుందా? మరి అంత ధైర్యంగా మే 9 విడుదల అని ప్రకటించారంటే… “హరిహరవీరమల్లు” ఆ తేదీకి రావడం లేదని వారికి నమ్మకంగా తెలిసి ఉండాలి. పైగా ఈ చిత్రం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో వస్తోంది. కనుక “హరిహర వీరమల్లు” విడుదల వాయిదా పడినట్లే అనిపిస్తోంది!!
హరిహర వీరమల్లు
మరోమారు వాయిదా?
