Sunday, February 15, 2026
HomeEntertainmentకర్ణాటక కాశ్మీర్ కూర్గ్ లో గ్రీన్ పార్క్ రిసార్ట్ అండ్ స్పా ప్రారంభమ్…చిన్న జీయర్ స్వామి...

కర్ణాటక కాశ్మీర్ కూర్గ్ లో గ్రీన్ పార్క్ రిసార్ట్ అండ్ స్పా ప్రారంభమ్…చిన్న జీయర్ స్వామి , రజనీకాంత్ చేతుల మీదుగా ఆరంభం….

- Advertisment -

ప్రకృతి అందాల నడుమ కనుల పండువగా గ్రీన్ పార్క్ రిసార్ట్ మరియు స్పా ప్రారంభమైంది.
డెన్మార్క్ ఆర్కిటెక్చర్ ని తలపించే అద్భుతమైన ఇంటీరియర్స్తో 37విల్లాలు 54 రూమ్స్తో దాదాపు 35 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ రిసార్టు ను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అట్లూరి పూర్ణ చంద్రరావు గారు నిర్మించారు. ఆయన 90 వ జన్మదినం సందర్భంగా ఈ స్పా రిసార్ట్ మొదలైంది. ఈ ప్రారంభోత్సవానికి చిన్న జీయర్ స్వామి గారు, రజనీకాంత్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జీయర్ స్వామి మాట్లాడుతూ ~ పది రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి విషయం చెప్పారు. 90 ఏళ్ల వయసులో అట్లూరి పూర్ణ చంద్రరావు గారి పట్టుదల చూసి ఆశ్చర్యపోయాను. ఈ రిసార్ట్స్ ని చూసిన తర్వాతఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అని చెప్పాలి అనిపించింది. ప్రకృతి అందాల నడుమ ఏర్పాటు చేసిన ఈ రిసార్ట్స్ సకల ప్రాణి సేవగా భావిస్తున్నాను అన్నారు.

రజనీకాంత్ గారు మాట్లాడుతూ నన్ను అంధ కానున్ చిత్రంతో హిందీ సినిమాకు పరిచయం చేసిన వ్యక్తి అట్లూరి పూర్ణ చంద్రరావు గారే. అ తర్వాత కూడా నాతో కొన్ని సినిమాకి తీశారు. నికార్సైన మనిషి. చెప్పిందే చేస్తారు. అందుకే ఆయన పిలవగానే వచ్చి ఈ ఫంక్షన్లో పాల్గొన్నాను. ఆయన 90 ఏళ్ల వయసులో ఇలాంటి అద్భుతమైన రిసార్ట్ కట్టటం ఎంతో సంతోషంగా ఉంది.

ఈ రోజు ఆయన పుట్టినరోజు మరియు మహా శివరాత్రి వంటి గొప్ప పర్వదినం కావటం దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియచేయటం చూస్తుంటే ఇంత కంటే గొప్ప విషయం ఏముంటుంది అని అనిపిస్తుంది అన్నారు.

ఆయన 120 ఏళ్లు బతకాలి అని కోరుకుంటున్నాను అన్నారు రజనీకాంత్. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ- శివరాత్రి పర్వదినంగా పాటు పూర్ణ చంద్రరావు గారి పుట్టినరోజున ఈ రిసార్ట్ కి రావటం ఎంతో ఆనంద దాయకం. ఆయన బతికున్నంతకాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

మురళీ మోహన్ గారు మాట్లాడుతూ- 53 ఏళ్ల క్రితం ఇదే కూర్గ్లో నటునిగా పరిచయం చేసిన వ్యక్తి పూర్ణ చంద్రరావు గారు. రాజా రామ్ మోహన్ రాయ్ అనే నన్ను మురళీమోహన్ ని చేసింది కూడా ఆయనే. అప్పటి నుండి ఈ రోజు వరకు 52 ఏళ్లుగా నటిస్తున్నానే ఉన్నాను.

అది ఆయన చేతి చలవే వల్ల ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాను. మరో అతిధి నిర్మాత దిల్ రాజు గారు మాట్లాడుతూ- నిర్మాతగా పూర్ణ చంద్రరావు గారు ఎంతో స్ఫూర్తి. ఆయన 90 ఏళ్ల వయసులో కూడా ఇంత యాక్టివ్ గా ఉండటం చూసి ఆయన సమర్పణలో నేను ఒక సినిమా నిర్మిస్తాను అని తన జన్మదినం సందర్భంగా మాట ఇస్తున్నాను అన్నారు.

ఈ వేడుకలో పూర్ణ చంద్రరావు గారి ఆహ్వానం మేరకు అటు అమెరికా ఇటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుండి పలువురు సినీ,రాజకీయ, వైద్య, వ్యాపార రంగ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేయటంతో పాటు రిసార్ట్స్ అభివృద్ధి చెందాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇదే వేడుకలో మురళీమోహన్ కు పద్మశ్రీ ప్రకటించిన నేపథ్యంలో సత్కరించారు పూర్ణచంద్ర రావు గారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments