గచ్చిబౌలి స్టేడియం ప్రాక్టీస్ గ్రౌండ్స్‌లో “గ్లో రన్ 2024” అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. స్వాతి వాసిరెడ్డి సారధ్యంలో గిగిల్ మగ్స్ ఈవెంట్స్ నిర్వహించిన ఈ రన్ లో 600 మంది పాల్గొని ఎప్పటికీ జ్ఞాపకాల్లో నిలిచిపోయే రాత్రికి సాక్ష్యమయ్యారు. ఫిట్‌నెస్, వినోదం, ఉత్సాహంతో కూడిన ఈ ఈవెంట్ అందర్నీ ఆకర్షించింది. ఎన్‌చాంటాయ్స్ అందించిన ఆటలు, నియాన్ థీమ్‌లో చేసిన ముఖ చిత్రకళ అందరినీ ఉత్సాహపరిచాయి, ఒక రంగురంగుల వాతావరణాన్ని సృష్టించాయి. జుంబా వార్మ్-అప్ సెషన్‌లో ప్రేక్షకులు ఉత్సాహంగా నృత్యం చేస్తూ ఫిట్‌నెస్‌ను ఆనందంగా స్వీకరించారు. చెరగని జ్ఞాపకాలుగా మారే వెలుగుల వాతావరణాన్ని “గ్లో రన్” సృష్టించింది. బ్యాండ్ సమర్థ్ లైవ్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఉత్సాహపరిచి.. ఆడిపాడేలా చేసింది. ఉత్సాహం, ఆనందం మరియు వెలుగుతో సమాజాన్ని ఒక్కటిగా చేసే ప్రయత్నంలో ఈ “గ్లో రన్-2024” అందరి హృదయాల్లో నిలిచిపోయింది!!
స్వాతి వాసిరెడ్డి సారధ్యంలో ఘనంగా గిగిల్’మగ్ ఈవెంట్స్ “గ్లో రన్ 2024”
Date: