మైథలాజికల్ జానర్‌లో అత్యంత భారీ చిత్రంగా విరభ్ స్టూడియో బ్యానర్ మీద రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో రవి కిరణ్ హీరోగా నటించారు. రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. శుక్రవారం నాడు ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హైదరాబాద్, దసపల్లా హోటల్ లో జరిగిన ఈ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర, నిర్మాతల మండలి అధ్యక్ష కార్యదర్శులు దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి, “హనుమాన్” స్థాయిలో “గదాధారి హనుమాన్” ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆగస్టు చివరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది!!
