డిసెంబర్ 14న
హైద్రాబాద్’లో ప్రీమియర్స్!
ప్రపంచవ్యాప్తంగా
త్వరలో విడుదల!!
అమెరికాలో స్థిరపడిన ఖుర్రం సయ్యద్… ముంబయికి చెందిన డాలీ తోమర్ ఓంషీల్ ప్రొడక్షన్స్ సంస్థలో భాగస్వాములు. హృదయాల నుంచి ఎప్పటికీ వెళ్ళని కథల్ని తెరకెక్కించాలన్నది వీళ్ళ లక్ష్యం. ‘జిందగీ ఇన్ టూ షేడ్స్’ – (జీవితానికి రెండు వైపులా) అటువంటి హార్ట్ టచింగ్ స్టోరీ అంటున్నారు వీళ్లిద్దరూ. తెరపై చూశాక… హృదయంలో తిష్ట వేసేంత గాఢత కలిగిన “జిందగీ ఇన్ టూ షేడ్స్” డిసెంబర్ 14న హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రీమియర్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా త్వరలో విడుదల కానుంది!!
ప్రప్రథమ ప్రవాస భారతీయుడు “ఇఫ్తేకర్ షరీఫ్” జీవితం ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపొందింది. తనకు జన్మనిచ్చిన దేశాన్ని, తనకు జీవితాన్నిచ్చిన దేశాన్ని రెంటినీ తన హృదయంలో ప్రతిష్టించుకున్న ఒక విజనరీ కథ ఇది. వేలాది మైళ్ళ దూరంలో ఉన్నా… తన మూలాలు మరువని ఓ ధీరోధాతుని బయోగ్రఫీ ఇది. రజనీష్ దూబే దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీని ఖుర్రం సయ్యద్, కల్పన రాజపుట్, డాలి తోమర్ సంయుక్తంగా నిర్మించారు. దేవు నాందేవ్ ఎడిటర్. పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ!!

