కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కి ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఆలోచనే ఈ దిల్ రాజు డ్రీమ్స్. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్ ని లాంచ్ చేస్తున్నాం’ అన్నారు నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరై వెబ్ సైట్ ని లాంచ్ చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పారు!!
ప్రతిభకు పట్టాభిషేకం చేసేందుకు
