HomeEntertainmentఆహా ఓటిటి లో అదరగొడుతున్న పూర్ణ ప్రదాన పాత్రలో నటించిన "డార్క్ నైట్" ఏప్రిల్ 8నుండి...

ఆహా ఓటిటి లో అదరగొడుతున్న పూర్ణ ప్రదాన పాత్రలో నటించిన “డార్క్ నైట్” ఏప్రిల్ 8నుండి తెలుగు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్!

- Advertisment -

పూర్ణ ప్రదాన పాత్రలో రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం “డార్క్ నైట్”. మార్చ్13న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి రివ్యూస్ తో చిన్న చిత్రాలలో పెద్ద విజయం సాధించింది. జి.ఆర్. ఆదిత్య ఈ చిత్రానికి కథ రాసి దర్శకత్వం వహించారు. పూర్ణ ఇందులో హేమ పాత్రలో నటించి కథకు కీలకంగా నిలిచే పాత్రను పోషించారు. ఆమెతో పాటు త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) రోషన్‌గా, విధార్థ్ అలెక్స్‌గా, సుభాశ్రీ రాయగురు సోఫియా పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఆథిత్యా, సంగీత దర్శకుడు మిస్కిన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో పి19 స్టూడియోస్ పతాకంపై సురేష్ రెడ్డి కొవ్వూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. ఏప్రిల్ 8 నుంచి ఈ మూవీ ఆహా తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఈ సినిమా డిజిటల్ రిలీజ్ గురించి….
నటి పూర్ణ మాట్లాడుతూ….”ఈ సినిమాలో ప్రత్యేకమైన భావోద్వేగం ఉంటుంది. చిన్న చిన్న తగాదాలతో భార్య భర్తల మధ్య ఏర్పడే ఎడబాటు మరో విదంగా తడబాటుకు గురి కాకూడదని, దాంపత్య జీవితంలో భార్య భర్తల తప్పు ఒప్పులు పక్కన పెడితే, ఇరువురి మధ్య వచ్చే గ్యాప్ లో మూడో వ్యక్తి వలన కాపురంలో ఎలాంటి ముసలం పుడుతుందో “డార్క్ నైట్” చిత్రం చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్లోనున్న యూత్ కు సంభందించిన పలు అంశాలు హైలెట్ గా వారి అనుభవాలను ప్రతిబింబిస్తాయి.” అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి : “పూర్ణ ప్రదాన పాత్రలో నటించిన “డార్క్ నైట్” చిత్రం మార్చ్13న రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో విడుదల చేసాము. మంచి రివ్యూస్ తో 3/5 మీడియా వారు రేటింగ్ ఇచ్చారు. డార్క్ నైట్ నాలుగు ప్రధాన పాత్రల జీవితాల చుట్టూ తిరుగుతుంది. వారి మధ్య ఉన్న సంక్లిష్ట భావోద్వేగాలు, రహస్యాలు, సంఘర్షణలు కథను ఉత్కంఠభరితంగా మలుస్తాయి. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రేక్షకులు భావోద్వేగాలతో నిండిన ప్రయాణాన్ని అనుభవిస్తారు. ఈ చిత్రంలో అతీంద్రియ అంశాలతో కూడిన ఒక ఊహించని ట్విస్ట్ కథను కొత్త మలుపు తిప్పుతూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. మిస్కిన్ ప్రత్యేకమైన సిగ్నేచర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఈ చిత్రం భావోద్వేగం, సస్పెన్స్‌ల సమ్మేళనంగా నిలుస్తూ “డార్క్ నైట్”ను మరపురాని సినిమాటిక్ అనుభవంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తానికి, కథ చెప్పే విధానం, భావోద్వేగాలు మరియు ఉత్కంఠతో కూడిన అంశాలతో “డార్క్ నైట్” ప్రేక్షకులను ఎమోషనల్ థ్రిల్ ఇస్తూ రెండు గంటలపాటు ఉత్కంటభరితంగా పాత్రలతో మమేకం చేస్తుంది. ” అన్నారు.

ఎలాంటి అసభ్య సన్నివేశాలు లేకుండా ముఖ్యంగా భార్యభర్తలు కలిసి చూడాల్సిన చిత్రం ఇది. ఈ ‘డార్క్ నైట్’ ఏప్రిల్ 8 న ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments