కుబేర” చిత్రంలో కీలక పాత్ర పోషించిన నాగార్జున… “కూలీ” చిత్రంలో కూడా ముఖ్యపాత్ర పోషించారు. “కుబేర” చిత్రాన్ని నిర్మించిన ఏషియన్స్ సంస్థ… “కూలీ” చిత్రం తెలుగు వెర్షన్ హక్కులు సొంతం చేసుకుంది. “అరవింద సమేత వీర రాఘవ” నుంచి సితార సంస్థతో ఎన్ఠీఆర్ కు అనుబంధం ఉంది. “దేవర” చిత్రాన్ని ఇదే సంస్థ పంపిణీ చేసింది. అంతేకాదు మళ్ళీ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. అంతేకాదు… ఇద్దరు హీరోల్లో ఒకడిగా ఎన్టీఆర్ నటించిన “వార్-2” తెలుగు హక్కులు దక్కించుకునే దిశగా ఈ సంస్థ పావులు కదుపుతోంది. “కూలీ” చాలా బాగా వచ్చిందని, అందులో నటించిన నాగార్జున చెప్పి ఉండడం వల్ల… ఆ చిత్రాన్ని ఏషియన్ ఫిల్మ్స్ ఏరికోరి తీసుకున్నట్లుగా… ఎన్టీఆర్ సూచన మేరకు- “వార్-2” కోసం సితార వంశీ పోటీ పడుతున్నారా అనే ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్ లో మొదలైంది. హృతిక్ రోషన్ – ఎన్ఠీఆర్ ల “వార్-2”, రజనీకాంత్ – నగార్జునల “కూలీ”… ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి!!
