హైదరాబాదులోని ఐకానిక్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యద్భుతమైన టెంపుల్ థీం సెటప్‌తో ఘనమైన సాంప్రదాయ తెలుగు పెళ్లిలో నాగ చైతన్య, శోభితా ధూళిపాళల వివాహం జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించినప్పటి నుంచి, బుధవారం రాత్రి 8:13 గంటలకు శుభ ముహూర్తన జరిగిన ఈ పెళ్లి తెలుగు సంప్రదాయాలకు అద్దంపట్టేలా, పెద్దల ఆధ్వర్యంలో ఆచార వ్యవహారాలతో అంగరంగ వైభవంగా జరిగింది. తరలివచ్చిన కుటుంబ సభ్యులు, స్నేహితుల హృదయపూర్వక ఆశీర్వాదాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రముఖులు కూడా హాజరయ్యారు!!