HomeEntertainment‘బ్యాండ్ మేళం’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కింగ్ ఆఫ్...

‘బ్యాండ్ మేళం’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు

- Advertisment -

‘కోర్ట్’తో బ్లాక్ బస్టర్ పెయిర్‌గా నిలిచిన హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానుంది. బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్, సెన్సేషనల్ డైరెక్టర్స్ వివి వినాయక్, బాబీ, నటుడు, నిర్మాత బండ్ల గణేష్, ఆస్కార్ గ్రహీత చంద్రబోస్, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌‌లో..

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ ఈవెంట్‌కి పెద్దలందరూ ఎన్నో ఆశీస్సులు ఇచ్చారు. అవన్నీ నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. ‘స్వాగ్’ మూవీలో రోషన్ నా కొడుకుగా చేశాడు. టాలెంట్ ఉన్న రోషన్ పెద్ద హీరో అవుతాడని అప్పుడే చెప్పా. ఈ మూడేళ్లలోనే ‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ వంటి చిత్రాలు వచ్చాయి. ‘కోర్ట్’లో శ్రీదేవీ చక్కగా నటించారు. ఈ కాకినాడ అమ్మాయికి మరిన్ని మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. డైరెక్టర్ సతీష్‌కి ఆల్ ది బెస్ట్. ‘బ్యాండ్ మేళం’ క్లైమాక్స్ గురించి అందరూ చెబుతున్నారు. ఈ మూవీని చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కోన గారికి సినిమా అంటే ప్రాణం, పిచ్చి. ఆయనకు సినిమాలే ప్రాణం. ఆయనలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌ని చాలా అరుదుగా చూస్తుంటాం. ఆయన ఇంకా ఇలాంటి మంచి చిత్రాల్ని తీస్తూ, ఎంతో మంది కొత్త ఆర్టిస్టుల్ని, దర్శకుల్ని పరిచయం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ .. ‘కోన వెంకట్ గారి సినిమా అంటే అది మా సినిమానే. ఆయనకు కథల పట్ల మంచి అభిరుచి ఉంటుంది. కోన గారు ఈ మూవీ కోసం విపరీతంగా ప్రమోషన్స్ చేశారు. అన్ని ఊర్లలో ఆయనే కనిపిస్తున్నారు. నేను కోన గారితో కలిసి ‘అదుర్స్’కి పని చేశాను. నేను, కోన గారు ఎప్పుడూ సింక్‌లో ఉంటాం. టీజర్ చూసిన తరువాత రోషన్ చాలా పెద్ద హీరో అవుతాడని నాకు అనిపించింది. సురేష్ బాబు ఓ మూవీని చూసి అద్భుతంగా విశ్లేషిస్తుంటారు. ఈ సినిమాని చూసి సురేష్ బాబు గారు కూడా రోషన్‌ను మెచ్చుకున్నారు. శ్రీదేవీ జర్నీ ఎంతో మందికి స్పూర్తి. మార్చి 26న ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది. కోన గారి కాంపౌండ్‌లో పడటం సతీష్ అదృష్టం. విజయ్ ఎప్పుడూ మంచి ఆల్బమ్స్, మ్యూజిక్ ఇస్తారు. మొదటి సారిగా కోన గారు తన కూతుర్ల పేరు మీదుగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ .. ‘కోన గారు నాకు ఈ మూవీని చూపించారు. సతీష్ ఈ సినిమాని అద్భుతంగా రూపొందించారు. రోషన్, శ్రీదేవీ చక్కగా నటించారు. ఫ్రెండ్స్ గ్రూపులోని వారు చాలా నవ్వించారు. ‘బ్యాండ్ మేళం’ టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. ‘కోన వెంకట్ గారు ఎవ్వరూ ఏ సాయం అడిగినా వెంటనే చేసేస్తారు. అలాంటి మంచి మనిషి ఆధ్వర్యంలో తీసిన ‘బ్యాండ్ మేళం’ బాగానే వచ్చి ఉంటుందని భావిస్తున్నాను. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మార్చి 26 నుంచి అందరి గుండెల్లో ‘బ్యాండ్ మేళం’ సౌండ్ మోగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’లో రోషన్ చేసిన చాలా సీన్స్ నాకు నచ్చాయి. ఈ మూవీ మంచి విజయం సాధించాలి. శ్రీదేవీకి మంచి పేరు రావాలి. దర్శకుడు సతీష్‌కు పెద్ద సక్సెస్ రావాలి. కోన వెంకట్ గారు ఎవ్వరి దగ్గరి నుంచి ఏమీ ఆశించకుండా అందరికీ సాయం చేస్తుంటారు. కోన గారు మొదటి సారిగా ‘సాంబ’ సినిమాకి ఫుల్ లెంగ్త్ డైలాగ్స్ రాశారు. ఆయనతో ఉంటే టైం అన్నదే తెలీదు. నాకు ‘అదుర్స్’ లాంటి మంచి కథను ఇచ్చిన కోన గారికి ఎప్పుడూ విజయాలే దక్కాలి. ‘బ్యాండ్ మేళం’ చిత్రానికి పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ .. ‘కోన వెంకట్ గారు ఎంతో మంది దర్శకుల్ని, ఆర్టిస్టుల్ని ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చారు. కోన వెంకట్ గారు తనకున్న ప్రాపర్టీలను అమ్మి ‘బ్యాండ్ మేళం’ని తీశారు. ఆయనకు సినిమాలంటే అంత పిచ్చి, ప్యాషన్, ప్రాణం. హర్ష్ రోషన్ చాలా కష్టపడుతున్నాడు. రోషన్ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. ‘బ్యాండ్ మేళం’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత, రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ కోసం వచ్చిన వినాయక్, బాబీ ఇలా ప్రతీ ఒక్కరూ నేను సంపాదించుకున్న ప్రాపర్టీనే. ‘బ్యాండ్ మేళం’తో నేను సతీష్ జవ్వాజిని సంపాదించుకున్నాను. హరీష్, బాబీ, గోపీచంద్ మలినేని, శివ నిర్వాణ, సతీష్ జవ్వాజి కథలు చెప్పినప్పుడు వారిలోని ప్యాషన్ చూసి అవకాశం ఇచ్చాను. సతీష్ గారు చెప్పిన కథ విన్న తరువాత రోషన్, శ్రీదేవీ అయితేనే పర్ ఫెక్ట్‌గా ఉంటారని అనుకున్నాను. ‘కోర్ట్’తో ఆ ఇద్దరూ తమ తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ‘బ్యాండ్ మేళం’ నా కోసం చూడండి. నచ్చకపోతే ఇంకో సారి నేను రాసిన సినిమాని చూడకండి. ఇక ఫ్యూచర్‌లో రోషన్, శ్రీదేవిలను వెతుక్కుంటూ కథలు వస్తుంటాయి. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ, విజయ్ బుల్గానిన్ సంగీతం, శివ ముప్పరాజు, నా కజిన్ రాజశేఖర్ ఇలా అందరూ సినిమాకి పిల్లర్‌లుగా నిలిచారు. నా కూతుర్లైన కావ్య, శ్రావ్యలకి సినిమాల పట్ల ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను నిర్మాతగా నా పేరు కాకుండా వాళ్ల పేర్లు పెట్టాను. హిస్టరీ ఛేంజ్ అవుతుందని వాళ్ల పేర్లు పెట్టాను. ఈ మూవీ క్లైమాక్స్ అందరినీ కదిలిస్తుంది. ప్రేక్షకులకు ఈ చిత్రం జీవితాంతం గుర్తుంటుంది’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ లాంటి మంచి సినిమాని నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ మూవీ చాలా బాగా వచ్చింది. రీ రీకార్డింగ్ బాగా వచ్చింది. ఫన్‌తో పాటుగా మంచి ఎమోషన్ ఉంటుంది. రోషన్, శ్రీదేవీ చక్కగా నటించారు. అందరూ తప్పకుండా మా సినిమాని చూడండి’ అని అన్నారు.

డైరెక్టర్ సతీష్ జవ్వాజి మాట్లాడుతూ .. ‘నేను అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగి ఎంతో ఏడ్చాను. కానీ మా ‘బ్యాండ్ మేళం’ ప్రీమియర్ చూసిన తరువాత అందరూ ఏడ్చారు. బెక్కెం వేణుగోపాల్ గారి వల్లే నేను కోన గారి వద్దకు వెళ్లాను. అలా ఈ మూవీ మొదలైంది. చంద్రబోస్ గారు రాసిన పాటలు చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. కాసర్ల శ్యామ్ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. విజయ్ బుల్గానిన్ ఆర్ఆర్ విని అందరూ ఏడ్చేశారు. క్లైమాక్స్ చూసి అందరూ ఎమోషనల్ అవుతారు. ఆ టైంలో నేను కచ్చితంగా ఆడియెన్స్‌కి గుర్తుకు వస్తాను. ఈ మూవీని చూసిన వెంటనే సురేష్ బాబు గారు ఫోన్ చేసి నన్ను పిలిపించారు. శ్రీరామ నవమి రోజు మా సినిమా వస్తుంది. అందరూ చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.

హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ లాంటి మంచి సినిమాను మాకు ఇచ్చిన కోన వెంకట్ గారికి థాంక్స్. ‘కోర్ట్’ టైంలో నాని అన్న ఉన్నాడనే ధైర్యం ఉండేది. ‘బ్యాండ్ మేళం’ కథకి కోన వెంకట్ గారు ఉండటంతో ధైర్యం వచ్చింది. మా ఈవెంట్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మార్చి 26న మా ‘బ్యాండ్ మేళం’ రాబోతోంది. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ యాదగిరి మీ అందరినీ నవ్విస్తాడు,ఏడ్పిస్తాడు. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ .. ‘‘కోర్ట్’కి ముందు ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. కానీ జగదీష్ గారు నాకు మొదటి అవకాశాన్ని ఇచ్చారు. ఆ టైంలో నాని గారు, దీప్తి అక్క మాకు అండగా నిలిచారు. ‘కోర్ట్’ తరువాత ఏం చేయాలా? అని అనుకుంటున్న టైంలో బెక్కెం వేణుగోపాల్ గారు కాల్ చేశారు. కోన వెంకట్ గారు నాకు ఈ కథను వినిపించారు. సతీష్ గారు చెప్పిన కథ నాకెంతో నచ్చింది. క్లైమాక్స్ నాకు చాలా నచ్చింది. ఈ మూవీలోని పాటలన్నీ ఇప్పటికే హిట్ అయ్యాయి. యాదగిరి, రాజమ్మ పాత్రలు అందరికీ నచ్చుతాయి. మార్చి 26న మా మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.

నిర్మాత శ్రావ్య మాట్లాడుతూ .. ‘నా పేరు శ్రావ్య. కోన వెంకట్ గారి కూతురిని. ‘బ్యాండ్ మేళం’ మూవీ చాలా బాగా వచ్చింది. అందరితో కలిసి మార్చి 26న ‘బ్యాండ్ మేళం’ వీక్షించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

‘కోర్ట్’ నిర్మాత దీప్తి మాట్లాడుతూ .. ‘‘కోర్ట్’తో రోషన్, శ్రీదేవీ, విజయ్ బుల్గానిన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. ‘బ్యాండ్ మేళం’ కూడా మా సినిమానే అన్నట్టుగా ఉంది. ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. విజయ్ తన మ్యూజిక్‌తో సినిమాని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్తాడు. కోన గారి సినిమా అంటే అది కచ్చితంగా హిట్టే. ‘బ్యాండ్ మేళం’ టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

‘కోర్ట్’ దర్శకుడు రామ్ జగదీష్ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ కూడా నా సినిమానే అన్నట్టుగా ఉంది. మా చందు (రోషన్), జాబిలి (శ్రీదేవి) మళ్లీ ‘బ్యాండ్ మేళం’తో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ ఇద్దరూ అద్భుతమైన యాక్టర్స్. ఈ ఇద్దరితో ఇలాంటి మంచి సినిమాని తీసిన కోన వెంకట్ గారికి థాంక్స్. ‘బ్యాండ్ మేళం’ మార్చి 26న మోత మోగిపోవాలి’ అని అన్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments