ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా “బరాబర్ ప్రేమిస్తా “. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ మహీ (“ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. త్వరలోనే “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ “బరాబర్ ప్రేమిస్తా ” సినిమా టీజర్ ను రిలీజ్ చేసి టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు!!