HomeEntertainmentప్రపంచ చరిత్ర సృష్టించిన యువ దర్శకుడు అశ్విని శ్రీకృష్ణ

ప్రపంచ చరిత్ర సృష్టించిన యువ దర్శకుడు అశ్విని శ్రీకృష్ణ

- Advertisment -

1666 (పదహారు వందల అరవై ఆరు) ఇండియన్ పుష్ అప్స్ నిర్విరామంగా (నాన్ స్టాప్) కేవలం 85.30 నిమిషాల్లో చేసి భారత్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు వర్ధమాన సినీ దర్శకుడు అశ్విని శ్రీకృష్ణ అలియాస్ లంక అశ్వని కుమార్ పాత్రుడు. ఈమేరకు భారత్ వరల్డ్ రికార్డ్స్ నేషనల్ కోఆర్డినేటర్ లయన్ కె. వి. రమణారావు ప్రకటించారు. ప్రపంచ రికార్డు నమోదు పత్రాన్ని, మెడల్, మెమెంటోను లంక అశ్వని కుమార్ పాత్రుడుకి అతిథులు ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ సమక్షంలో సంస్థ నేషనల్ కోఆర్డినేటర్ లయన్ కె.వి.రమణారావు అందజేశారు.

ఆయన మాట్లాడుతూ…. “ఇది లెక్కించటానికే తాము కష్టపడ్డామని, అలాంటిది ఇతను సునాయాసంగా సాధించాడని అభినందించారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ… అశ్విని గత 12 సంవత్సరాలుగా తనకు తెలుసనీ, ఈ రికార్డు సాధించటానికి మానసికంగా ఎంతో ధృడంగా ఉండటం వల్లనే సాధ్యపడిందని, భవిష్యత్తులో సినీ రంగంలో కూడా ఎన్నో అపూర్వ విజయాలు అందుకోవాలని కోరుకున్నారు. ఈ అవార్డు అందుకున్న అశ్వని కుమార్ మాట్లాడుతూ… “సినీ రంగంలో తన పేరుకు తన తండ్రి పేరును జత చేసుకొని అశ్వని శ్రీ కృష్ణగా మార్చుకున్నానని, అలాగే ఈ అవార్డు సాధించటానికి దివంగతులైన తన తాత మరియు తల్లి తండ్రుల ఆశీస్సులకు, తన అన్నా వదినల సహకారం కారణమని, ఈ రికార్డ్ ను నా అన్నావదినలకే అంకితమిస్తున్నట్లు తెలిపాడు.

హైదరాబాద్ జ్యోతి రంజన్ నెస్ట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్కిటెక్ట్ రామ్ నందా, దర్శకుడు, నిర్మాత ప్రణవ స్వరూప్ అతిథులుగా పాల్గొన్నారు, నల్లు ఉమా జ్యోతి రెడ్డి సహకారం అందించారు!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments