వేదం అనంతరం… అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కలయికలో వస్తున్న చిత్రం ‘ఘాటి’. తమిళ స్టార్ విక్రమ్ ప్రభు ముఖ్య పాత్ర పోషిస్తున్న ఘాటిని UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. జూలై 11న రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి జానపద ఊపుతో నిండిన పాట “సైలోరే” సాంగ్ విడుదల చేశారు. నాగవెళ్లి విద్యాసాగర్ స్వరపరిచిన ఈ పాటకు కృష్ణ సాహిత్యం సమకూర్చగా… లిప్సిక భాష్యం, సాగర్ నాగవెళ్లి, సోనీ కోమండూరి ఆలపించారు. రాజు సుందరం కోరోయోగ్రఫీ చేశారు!!
