దర్శక రచయిత రామ్ రావిపల్లి మరో ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. ఈ మధ్యకాలంలో అవార్డుల పరంపరతో బాగా ఫేమస్ అయిన షార్ట్ ఫిలిం :”ఐ హేట్ యు డాడ్!”
ఈనాటి విద్యా వ్యవస్థలో హాస్టల్ కల్చర్ మీద రామ్ రావిపల్లి ఎక్కు పెట్టిన ఓ పవర్ ఫుల్ డిజిటల్ మిస్సైల్ ఈ షార్ట్ ఫిల్మ్ అని అనేకమంది ప్రముఖులు ప్రశంసించడం మనం చూశాం.
ఈ షార్ట్ ఫిలిం లో తండ్రిగా రామ్ రావిపల్లి, కొడుకుగా దినేష్ రెండు తరాలకు ప్రతినిధులుగా పోటాపోటీగా నటించారు.
ఇప్పటివరకు వివిధ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ఈ షార్ట్ ఫిలిం 12 అవార్డులు గెలుపొందింది. ఇప్పుడు మరో అవార్డును కూడా కైవసం చేసుకోవడం విశేషం!
తండ్రిగా రామ్ రావిపల్లి చేసిన విలక్షణ అభినయానికి “ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (బే ఆఫ్ బెంగాల్)” నిర్వహించిన కాంపిటీషన్లో “బెస్ట్ యాక్టర్” అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా సభ్యత్వం ఉన్న “ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్” వారు ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు.

హౌరా (కలకత్తా) లోని శరత్ సదన్ ఆడిటోరియంలో ఈ ఏడాది జూన్ రెండో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు ప్రధానోత్సవ సభలో రామ్ రావిపల్లి కి ఈ అవార్డును బహుకరించనున్నట్టు ఆ ఫెస్టివల్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ షార్ట్ ఫిలిం కి సంబంధించి ఇది 13వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు.
రామ్ రావిపల్లి తెలుగు సినిమా పరిశ్రమలో నటుడి గా రచయితగా దర్శకుడిగా నిర్మాతగా సుప్రసిద్ధులు. మన సిని’మా’ రంగులరాట్నం డైలీ ఈ పేపర్ కు ఆయన ఎడిటర్ కూడా.
