ఇటీవల ఓ ఫంక్షన్ లో సమంత చేసిన ప్రసంగానికి చప్పట్లు కొట్టి మరీ మెచ్చుకున్నారు అమల అక్కినేని. మాజీ కోడలికి మద్దతుగా అమల మెచ్చుకోలు చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో సమంత నటించిన “ఏమాయ చేశావే” చిత్రం విడుదలై 15 ఏళ్ళు కావస్తోంది. ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే నాగ చైతన్య – సమంత ప్రేమలో పడ్డారు. తన 15 ఏళ్ల జర్నీ గురించి మాట్లాడుతూ సమంత ఎమోషనల్ అవ్వడం, అమల మెచ్చుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది!!
