సల్మాన్ చిత్రం బన్నీకి
బన్నీ చిత్రం వెంకీకి?

త్రివిక్రమ్ తో చేయాల్సిన చిత్రాన్ని పక్కన పెట్టి అల్లు అర్జున్… అట్లీతో సినిమా చేస్తుండడం తెలిసిందే. నిజానికి సల్మాన్ ఖాన్ తో అట్లీ చేయాల్సిన సినిమా ఇది. ఈ నేపథ్యంలో… అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి కేటాయించుకున్న సమయాన్ని వెంకీతో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ షిఫ్ట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

అట్లీ సినిమా పూర్తి కావడానికి ఎంత లేదన్నా సంవత్సరం పట్టే అవకాశం ఉంది కాబట్టి… “గుంటూరు కారం” తర్వాత నుంచి మెగా ఫోన్ కు దూరంగా ఉన్న త్రివిక్రమ్… మరో ఏడాది వృధా చేసుకోవడానికి సుముఖంగా లేరని… అందుకే తన తదుపరి చిత్రాన్ని వెంకీతో ప్లాన్ చేసుకుంటున్నారని సితార వర్గాల భోగట్టా!!

