అట్లీ చిత్రంలో అల్లు
త్రిపాత్రాభినయం?
హేట్ చేసేవాళ్ళూ
హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనా?
ఇంకా పేరు పెట్టని అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి రోజుకో సరికొత్త వార్త చక్కర్లు కొడుతూ… ఈ చిత్రం క్రేజ్ ను పెంచుకుంటూ పోతోంది. ఈ చిత్రంలో దీపిక పదుకోన్ తోపాటు… రష్మిక, జాన్వి కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారనే వార్త సృష్టించిన సంచలనం సద్దుమణగక ముందే… ఈ చిత్రంలో “అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు” అనే మరో వార్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ ప్రముఖ బాలీవుడ్ వెబ్సైట్ కథనం ప్రకారం అయితే… ఈ చిత్రంలో ఐకాన్ స్టార్… .మూడు కాదు ఏకంగా నాలుగు పాత్రలు పోషిస్తున్నాడు. “తాతగా, తండ్రిగా, ఇద్దరు కవల సోదరులుగా” నాలుగు పాత్రల్లో రక్తి కట్టించేందుకు నడుం కడుతున్నాడు. తాత పాత్ర పోషణకు సిద్ధపడడం నిజమైతే… కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అల్లు అర్జున్ ని హేట్ చేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు కూడా అతనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!!
