Saturday, April 19, 2025

Top 5 This Week

Related Posts

అంబేద్కర్ జయంతి సందర్భంగాఅగ్రహారంలో అంబేద్కర్ ఫస్ట్ లుక్!

మన రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా… “అగ్రహారంలో అంబేద్కర్” సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. తెలంగాణ అధికారపక్ష ఎమ్.ఎల్.సి అద్దంకి దయాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పురస్కారాలు అందుకున్న ఈ చిత్రాన్ని రామోజీ – లక్షమోజి ఫిల్మ్స్ పతాకంపై మంథా కృష్ణచైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. హీరో కూడా ఆయనే కావడం విశేషం. మెల్లగా మరుగున పడుతున్న అంబేద్కర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు పూర్తి సమయ సహకారాలు అందిస్తామని,”మన దేశ రాజ్యాంగ సృష్టికర్త అయిన అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రతి స్కూల్ లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని” ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ పిలుపునిచ్చారు.

ఇంకా ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు చంద్రమహేష్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సంతోషం సురేష్, సీనియర్ హీరో రాంకి, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ చైర్మన్ హరి గోవింద ప్రసాద్, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ సి.యి.ఓ రాహుల్, రాయల్ రిడ్జ్ ప్రాపర్టీస్ సి.యి.ఓ శ్రీవికాస్, సివిల్ కోర్ట్ జడ్జి సురేష్, అంబేద్కర్ యాక్టివిస్ట్ అనిత, సినిటేరియా మీడియా వర్క్స్ అధినేత వెంకట్ బులెమాని పాల్గొని… “అగ్రహారంలో అంబేద్కర్” అసాధారణ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రాన్ని సినిటేరియా మీడియా వర్క్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, కుల మత ప్రాంత వర్గ వైషమ్యాలకు అతీతంగా సమాజ స్థాపన కోసం కృషి చేసిన అంబేద్కర్ కు గొప్ప నివాళిగా ఈ చిత్రాన్ని ఎన్నో వ్యయప్రయాసలకు లోనై తెరకెక్కించామని… హీరో కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ మంథాని కృష్ణచైతన్య తెలిపారు. ఈ చిత్ర రూపకల్పనలో.. మరియు విడుదల విషయంలో తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరున ఆయన కృతజ్ఞతలు తెలిపారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles