ఒత్తిడి, అధిక ఆలోచనలు తగ్గించుకోవాలి
-సౌత్ ఇండియన్ అంటే చాలా ఇష్టం:- హీరోయిన్ రెజీనా కసాండ్రా
హీరోయిన్ రెజీనా చేతుల మీదుగా శ్రీకాకుళంలో ‘కలర్స్ 2.0’ ప్రారంభం
▪️ 53వ బ్రాంచీ లాంచ్ చేసిన ‘కలర్స్ హెల్త్‌కేర్’
▪️ అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుక
▪️ ఆధునిక టెక్నాలజీతో ‘కలర్స్ 2.0’ ట్రీట్మెంట్
-అత్యుత్తమ టెక్నాలజీ సహాయంతో కలర్స్ వెల్నెస్ లో సేవలు:-కలర్స్ యాజమాన్యం
శ్రీకాకుళం:-
ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ ‘కలర్స్ (Kolors)’ తన నూతన బ్రాంచ్ కలర్స్ 2.0ను ఘనంగా ప్రారంభించింది. శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రోడ్డు, పాండురంగ వీధిలో ఏర్పాటు చేసిన ‘కలర్స్ (Kolors) హెల్త్‌కేర్’ నూతన బ్రాంచీని హీరోయిన్ రెజీనా కాసాండ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ఒత్తిడిని అధిగమించడం, అధిక ఆలోచనలను దూరం చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం, అందం పొందవచ్చని అన్నారు. తనకు సౌత్ ఇండియా ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. వెజిటేబుల్ కు ప్రాధాన్యత ఇస్తానన్నారు.
ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యం, అందంపై శ్రద్ధ వహించడం ఎంతో అవసరం. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన బరువు తగ్గడం, జుట్టు, చర్మ సమస్యలకు అత్యాధునిక చికిత్సలను శ్రీకాకుళం ప్రజల కోసం కలర్స్ హెల్త్‌కేర్ సంస్థ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు. కలర్స్ సంస్థ అందిస్తున్న సేవలు ఇప్పటికే ఎందరిలోనో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి అని’’ ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా .మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ, ” శ్రీకాకుళం బ్రాంచ్‌ను ఆవిష్కరించిన రెజినా కు కృతజ్ఞతలు. 22 ఏళ్ల అనుభవం మాకు మరింత నమ్మకం ఇచ్చింది. నగర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశాం. యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో అధిక బరువు, హెయిర్, స్కిన్ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాల చికిత్సలను అందిస్తున్నాం ఆరోగ్యంగా, అందంగా ఉండాలన్న ప్రతి ఒక్కరి ఆశకు కలర్స్ హెల్త్ కేర్ ఎల్లప్పుడూ తోడ్పడుతుంది” అని అన్నారు.
కలర్స్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ పుట్టిన ఊరు శ్రీకాకుళంలో సెంటర్ ప్రారంభించడం ఎంతో సంతోషమన్నారు. తమకు చెన్నైలో ఉన్న స్టోర్ కి ఇక్కడ ఏర్పాటుచేసిన స్టోర్ కి తేడా లేకుండా ఆధునాతనమైన సేవలు అందిస్తామన్నారు.
‘‘రెండు దశాబ్దాలకు పైగా హెల్త్‌కేర్ రంగంలో విశేష గుర్తింపు పొందిన కలర్స్, ఇప్పుడు ‘కలర్స్ 2.0’ పేరుతో మరింత ఆధునిక సాంకేతికతను శ్రీకాకుళం వాసులకు పరిచయం చేస్తోంది. అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలో సురక్షితమైన పద్ధతుల్లో చికిత్సలు అందించడమే మా లక్ష్యం. ఇప్పటికే లక్షలాది మంది కస్టమర్ల విశ్వాసాన్ని గెలుచుకుని, 53వ బ్రాంచీని సగర్వంగా ఆవిష్కరిస్తున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా మా సేవలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఇప్పుడు ‘కలర్స్ 2.0’ గా రూపాంతరం చెందాం. యూఎస్-ఎఫ్‌డీఏ (US-FDA) ఆమోదం పొందిన అత్యాధునిక టెక్నాలజీతో అధిక బరువు, జుట్టు, చర్మ సమస్యలకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను శ్రీకాకుళం ప్రజలకు చేరువ చేయడం సంతోషంగా ఉంది” అని తెలిపారు.
కలర్స్ ఆపరేషన్ విభాగ డైరెక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ ఉత్తమ వెల్నెస్ క్లినిక్ గా కలర్స్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు.
మంచి ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుతూ బరువు తగ్గించడం తమ ప్రత్యేకత అని చెప్పారు. కలర్స్ 2.0 (టూ పాయింట్ ఓ) ను మరింత ఉత్తమంగా తీర్చిదిద్దేలా
2019 లో మరలా తీసుకురావడం జరిగింది అన్నారు. 51 మంది డెర్మటాలజిస్టులు ఉన్న ఏకైక వెల్నెస్ సెంటర్ తమదే అని చెప్పారు.
5ఎం మీడియా ఆధ్వర్యంలో జైదీప్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో అభిమానులు, అతిథులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

