HomeEntertainmentఏపీ ప్రభుత్వ పన్ను రాయితీ పొందే అర్హత ఉన్ నసినిమావిజయ్ దేవరకొండ "రణబాలి

ఏపీ ప్రభుత్వ పన్ను రాయితీ పొందే అర్హత ఉన్ నసినిమావిజయ్ దేవరకొండ “రణబాలి

- Advertisment -

“

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రీసెంట్ మూవీ రణబాలి ప్రేక్షకుల ఆదరణతో అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు దక్కుతున్నాయి. రాయలసీమ గడ్డపై జరిగి, చరిత్రలో మరుగుపరిచిన చారిత్రక ఘటనల స్ఫూర్తితో, సీమ వీరుల నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు రాహుల్ సంకృత్యన్. ఇలాంటి చారిత్రక నేపథ్య సినిమాలకు ప్రభుత్వాలు పన్ను రాయితీలు కల్పించడం చూస్తున్నాం. గతంలో గౌతమీపుత్రశాతకర్ణి సినిమాకు ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది.

పాఠ్య పుస్తకాల్లో నేర్పించని చరిత్రను, మనకు తెలియకుండా దాచిన హిస్టరీని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన రణబాలి వంటి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్నురాయితీ ఇస్తే బాగుండేది అనే చర్చ ప్రేక్షకుల్లో మొదలైంది. పన్ను రాయితీ కోసం నిర్మాతలు ప్రభుత్వానికి అభ్యర్థన చేయాల్సింది. ఈ పన్ను రాయితీ వల్ల ఆర్థికంగా సినిమా వచ్చే లాభం కంటే ఒక ప్రత్యేక గౌరవం ఈ సినిమా దక్కేది. ఈ విషయంలో చిత్రబృందం చొరవ చూపించి ఉండాల్సింది. రణబాలి వంటి చిత్రాల వల్ల మన చరిత్ర గొప్పదనం, మన వీరుల త్యాగం, పోరాటం గురించి భవిష్యత్ తరాలకు తెలిసే అవకాశం ఏర్పడుతోంది.

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments