
ప్రభాస్… ఒక పేరు కాదు, ఓ బ్రాండ్! ‘బాహుబలి’తో ప్రపంచానికి తన సత్తా చాటిన ప్రభాస్, ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలతో తన మార్కెట్ పరిధిని మరింత పెంచుకున్నాడు.
భాషలతో సంబంధం లేదు… ప్రాంతాలతో పరిమితి లేదు… ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు, దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన ఉత్సాహం!
స్టార్డమ్ చాలామందికి ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల ప్రేమను, నమ్మకాన్ని సంపాదించుకోవడం కొందరికే సాధ్యం. ప్రభాస్ ఆ అరుదైన కోవకు చెందినవాడు.u
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ రెబల్ స్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు!
హ్యాపీ బర్త్‌డే డార్లింగ్ ప్రభాస్!
