
పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ లో ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం “ఆలోచన”. సీనియర్ నటులు స్వర్గీయ జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్, జెన్నీ, సుజనా రెడ్డి, మాధవి, అనుపమ స్వాతి, జస్సి అద్వైక, హసిత, ప్రసాద్ రామ్,నరేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను పద్మశ్రీ మురళి మోహన్ గారు విడుదల చేశారు, “ఆలోచన” టీజర్ ను ప్రముఖ రచయిత విజయేoద్ర ప్రసాద్ గారు విడుదల చేశారు, “భజేగోవిందం” పాటను శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వారు విడుదల చేశారు అలాగే “అమ్మ” సాంగ్ ను అక్కినేని అమల విడుదల చేశారు.
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆలోచన సినిమా త్వరలో థియేటర్స్ లో విడుదలకు సిద్దంగా ఉంది, మేకర్స్ రిలీజ్ డేట్ ను
ప్రకటించాబోతున్నారు. సమాజంలో జరిగే కొన్ని ఆసక్తికరమైన వాస్తవిక జీవితాలు, స్నేహానుభంధాల ఆధారం చేసుకొని దర్శకుడు సురేందర్ చాచా ఈ సినిమాను తెరాకెక్కించారు. లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ తో “ఆలోచన” సినిమా కథ కథంశాలు ఉండబోతున్నాయి.
ఈ చిత్రానికి సాంకేతిక వర్గం కెమెరా: టి. సురేంద్ర రెడ్డి, సంగీతం: వియాన్.ఎస్.ఏ, పాటలు: ప్రతాప్ రాజులపల్లి, ఎడిటర్: ఆర్.ఎల్.వర్మ, ఆర్ట్: గిరీష్ దేవాంగ్, ఈ.పి: సీ.హెచ్.విజయ్.

