
నితీష్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం వరల్డ్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. 2026 అక్టోబర్ 27 సాయంత్రం లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ఉన్న డేవిడ్ గెఫెన్ థియేటర్లో ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ జరగనుంది. ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించే ఈ ప్రీమియర్‌కు హాలీవుడ్ ప్రముఖులు, దర్శకులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.
అకాడమీ మ్యూజియం చలనచిత్ర చరిత్ర, కళ, సాంకేతికతకు అంకితమైన ప్రముఖ సంస్థ. గతంలో ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాలకు, ఆస్కార్‌కు సంబంధించిన వేడుకలకు ఈ మ్యూజియం వేదికగా నిలిచింది. ఇప్పుడు ‘రామాయణ’ ప్రీమియర్ అక్కడ జరగనుండటం ఈ చిత్ర బృందానికి ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలవనుంది. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేసే దిశగా ఇది కీలక ముందడుగు కానుంది. ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది!!
