ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ వివాహ వేడుకకు సంబంధించిన వార్త సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
కావ్య మారన్ తల్లిదండ్రులు కళానిధి మారన్, కావేరి మారన్ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వివాహ వేడుకకు ఆహ్వానించారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో తమ కుమార్తె వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు.
నవంబర్ 11న గ్రీస్లో అనిరుధ్ – కావ్య మారన్ వివాహ వేడుక జరగనుండగా, నవంబర్ 21న చెన్నైలో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.
అనిరుధ్ – కావ్య మారన్ వివాహం సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన వేడుకగా నిలవనుంది.

