HomeEntertainmentనూజిళ్ల సూరిబాబుకి నట దర్శక, వ్యాఖ్యాన రత్న బిరుదు ప్రదానం

నూజిళ్ల సూరిబాబుకి నట దర్శక, వ్యాఖ్యాన రత్న బిరుదు ప్రదానం

- Advertisment -

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ముఖ్య అతిథిగా జిత్ మోహన్ మిత్ర బృందంచే నూజిళ్ల సూరిబాబుకి నట దర్శక, వ్యాఖ్యాన రత్న బిరుదు ప్రదానం

రాజమహేంద్రవరం: జిత్ మోహన్ మిత్ర బృందం 24వ వార్షికోత్సవ సందర్బంగా శుక్రవారం సాయంత్రం వంక బాలకృష్ణ పర్యవేక్షణలో నిర్వహించిన సంగీత విభావరిలో పలువురు గాయనీ గాయకులు గీతాలు ఆలపించారు. అనంతరం నటగాయకుడు శ్రీపాద జిత్ మోహన్ మిత్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఎల్ ఐ సి అధికారి మురళీ కృష్ణ జ్యోతి ప్రకాశనం చేశారు. ఈసందర్బంగా బహుముఖ ప్రతిభాశాలి నూజిళ్ల సూరిబాబుని “నట దర్శక, వ్యాఖ్యాన రత్న” బిరుదుతో సత్కరించారు. సూరిబాబు దంపతులను పలువురు పూలమాలలతో సత్కరించారు. సూరిబాబు వ్యక్తిత్వాన్ని వక్తలు కొనియాడారు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, స్వాతిముత్యం సంపాదకుడు ధీరజ అప్పాజీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఉల్లి సత్య నాగ వర ప్రసాద్, అప్పారావు, పివిఎస్ కృష్ణారావు, జె శివప్రసాద్, వి.జగపతి రావు, సుక్కిరెడ్డి శ్రీనివాసరావు, రామకృష్ణ, డిఎస్ శ్రీనివాసరావు, పిచ్చుక మహేష్, మంగళంపల్లి సూర్య కుమారి, బి. సీతారామారావు, శ్రీపాద శంకర రావు, హరి, డా. గిరజాల సోమరాజు నాయుడు, గుంటూరు శ్రీనివాసరావు, సిహెచ్ విశ్వనాధ్ దంపతులు, ఎం. కృష్ణ, సామ్రాట్, పిచ్చుక రాంబాబు, రేవతి, జోగారావు, వడ్డాది నాగేంద్ర, ఏ కృష్ణ శర్మ, తదితరులు పాల్గొన్నారు!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments