ఎలాంటి భారీ తారాగణం లేదు… ఆర్భాటమైన ప్రమోషన్ లేదు… కేవలం రూ.2 కోట్ల బడ్జెట్! అయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం వంద కోట్లకు చేరువై సంచలనం సృష్టిస్తోంది ‘హనుమాన్ అంశ్’. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత ప్రయాణం, ఆధ్యాత్మిక భావజాలం ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజున కేవలం రూ.10 లక్షల నెట్‌తో ప్రారంభమైన ఈ సినిమా.. ప్రేక్షకుల మౌత్ టాక్‌తో మూడో వారం నుంచి అనూహ్యంగా పుంజుకుంది. నాలుగో వారంలోనూ భారీ వసూళ్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తాజాగా 29 రోజుల్లోనే సుమారు రూ.82.88 కోట్ల నెట్, రూ.97.99 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం!!

