శ్రీ విష్ణు పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్టైనర్గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తో అలరించబోతున్నారు. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈసందర్భంగా ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్. నారాయణమూర్తి, దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, ప్రముఖ దర్శకులు బాబ్జి, నందిని రెడ్డి, శివ నిర్వాణ తదితరులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కామ్రేడ్ కళ్యాణ్ కడుపారా నవ్విస్తాడని చిత్రబృందం హామీ ఇచ్చింది!!

