నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా యాక్షన్ ఎక్స్‌ట్రావ్యాగెంజా ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’, ఇటీవల విడుదలైన టీజర్‌తో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆయా షేర్’ కు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత మేకర్స్ ‘యెష నాగుల’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జానపద బాణీకి అనిరుధ్ తనదైన హై-ఎనర్జీ మ్యూజిక్‌ను జోడించిన ఈ పాటను డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ కాన్సర్ట్‌లో లైవ్‌గా విడుదల చేశారు. వేలాది మంది అభిమానుల మధ్య పాటను లైవ్‌లో ప్రదర్శించగా, ప్రేక్షకులు డ్యాన్స్ చేస్తూ, కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకోవడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ జంగి రెడ్డి, ప్రభా వోకల్స్, ఆట సందీప్ కొరియోగ్రఫీ విజువల్‌గా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది!!

