HomeEntertainmentసరికొత్త ఒరిజినల్స్, బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులకు మరింత చేరువ కానున్న తెలుగు జీ5

సరికొత్త ఒరిజినల్స్, బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులకు మరింత చేరువ కానున్న తెలుగు జీ5

- Advertisment -
  • ఎన్‌బీకే111, వృషకర్మ, జనవరి 12 విడుదల నుంచి పంచనామా, జయమ్ము నిశ్చయమ్మురా 2 వరకు.. దక్షిణాది ప్రేక్షకుల మనసుకు చేరువయ్యే విభిన్నమైన, నెటివిటీ కథలతో ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త వినోదాన్ని అందించ‌నున్న తెలుగు జీ5

భారతీయ వినోద రంగం భవిష్యత్ వైవిధ్య‌మైన భాషాల‌తో, క్రియేటివిటీతో, కొత్త హ‌ద్దుల‌ను నిర్దేశిస్తూ ముందుకు సాగుతోంది. ఈ జ‌ర్నీలో క్రియేట‌ర్స్ ప్ర‌తిభ ఎంతో కీల‌కంగా మారింది. అందులో భాగంగా ఇప్పుడు తెలుగు జీ5 తన కంటెంట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తూ.. ఐకానిక్ ఫ్రాంచైజీలు, ఒరిజినల్ సిరీస్‌లు, భారీ చిత్రాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, గతంలో ఎన్నడూ లేనంత విస్తృతమైన వినోద అనుభవాలతో కూడిన భారీ కంటెంట్ లైనప్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇండస్ట్రీలో అత్యంత నిబద్ధతతో, నాణ్యమైన కంటెంట్‌ను ఆదరించే ప్రేక్షకులే తెలుగు వినోద రంగానికి అసలైన బ‌లం.. సాంస్కృతికతను కాపాడుకుంటూనే సృజనాత్మకతలో కొత్తదనాన్ని అందించడంలో జీ5 ఎప్పటికప్పుడు ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రేక్షకుల మనసులను బలంగా తాకే కథలను అందిస్తూనే.. పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఉన్న సంప్రదాయ పద్ధతులను ఎప్పటికప్పుడు కొత్తగా నిర్వచిస్తోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థలు, బ్యానర్స్‌తో తెలుగు జీ5 పార్ట‌న‌ర్‌ఫిప్ కుదుర్చుకుంది. దీంతో ఈ కొత్త కంటెంట్ లైనప్‌కు మరింత బలాన్ని చేకూరింది. వైజయంతీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ), ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్, షైన్ స్క్రీన్స్, వృద్ధి సినిమాస్, మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్, ఉదయ భాను ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్‌ఎల్‌పీ వంటి ఇండస్ట్రీలోని ప్రముఖ సంస్థలతో కలిసి తెలుగు జీ5 ఈ భారీ లైనప్‌ను సిద్ధం చేసింది. ఒరిజినల్స్ విభాగంలో నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న‌ ‘శ్రీమతి’, భరత్ నివాస్, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘పంచనామా’తో పాటు.. జగపతి బాబు హోస్ట్‌గా ప్రేక్షకుల అభిమాన షో ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ మరోసారి సందడి చేయనుంది. ఇక సినిమా విభాగంలో కూడా ఆసక్తికరమైన చిత్రాల లైనప్‌ను తెలుగు జీ5 అందిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న ‘లెనిన్’..గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ నటిస్తున్న ‘ఎన్‌బీకే111’..అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ దగ్గుబాటి, నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’..కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చైతన్య అక్కినేని, మీనాక్షి చౌదరి నటిస్తున్న ‘వృషకర్మ’.. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో అల్లరి నరేష్, కాజల్ చౌదరి నటిస్తున్న ‘కనక దుర్గ’ చిత్రాలు ఈ లైనప్‌లో ఉన్నాయి. అలాగే ‘జననాయకుడు’, ‘హాయ్’, ‘డిమాంటీ కాలనీ 2’, ‘ఏ క్వీన్’, ‘వీరప్పన్ 2’ వంటి డబ్బింగ్ చిత్రాలతో కూడా తెలుగు జీ5 ప్రేక్ష‌కును అల‌రించ‌నుంది.

జీ5 తెలుగు, త‌మిళ్‌, మలయాళం బిజినెస్ హెడ్ లాయిడ్ సి. జేవియర్ మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనంతో, సంప్రదాయానికి భిన్నంగా ఉండే కథలను ఆదరిస్తుంటారు. తమ భావోద్వేగాలకు, మనసుకు దగ్గరయ్యే సహజత్వాన్ని కూడా ఎంతో విలువగా భావిస్తారు తెలుగు ఆడియెన్స్‌. గత కొన్నేళ్లుగా క్రియేటర్స్‌, నిర్మాణ సంస్థలు, ప్రేక్షకులతో మేం ఏర్పరుచుకున్న పార్ట్‌న‌ర్‌షిప్‌ ద్వారా మార్కెట్‌లో ఎలాంటి కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే విషయంపై మాకు స్పష్టమైన అవగాహన ఏర్పడింది. అదే ఆలోచనతో ఈ కొత్త కంటెంట్ లైనప్‌ను రూపొందించాం. ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ నుంచి ‘శ్రీమతి’, ‘పంచనామా’ వంటి ఒరిజినల్స్ వరకు.. ప్రేక్షకులకు ఇప్పటికే దగ్గరైన కంటెంట్‌తో పాటు సరికొత్త కథలను కూడా ఈ లైనప్‌లో అందిస్తున్నాం. ప్రతి టైటిల్‌కు ప్రత్యేకమైన కథనం, విభిన్నమైన దృక్పథం ఉంది. కొత్తగా, ధైర్యంగా, ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకునే కథలను అందించాలనే మా నిబద్ధతకు ఈ కంటెంట్ లైనప్ సాక్ష్యం. అదే సమయంలో తెలుగు ప్రేక్షకుల భావోద్వేగాలకు దగ్గరగా ఉండే అంశాలను కూడా ఈ కథల్లో జోడించాం” అని అన్నారు.

ఒరిజినల్స్, సినిమాలతో పాటు.. ఏఐ ఆధారిత స్టోరీటెల్లింగ్‌తో కూడా తెలుగు జీ5 తన వినోద ప్రపంచాన్ని మరింత విస్తరిస్తోంది. ‘గరుడ’, ‘విక్రమ్ బేతాళ్’, ‘శివ్ సతి’, ‘చంద్రకాంత’, ‘తిరుపతి బాలాజీ’, ‘నర్మద’, ‘రామ్ ఆంజనేయ యుద్ధ్’ వంటి టైటిల్స్‌తో సరికొత్త కథనాలను ప్రేక్షకులకు అందించనుంది.

అలాగే పిల్లల కోసం ‘బార్బరీక్’, ‘కుండక మండక్క’ వంటి కంటెంట్‌తో పాటు.. ఫిఫా, బుండెస్లీగా, కోప్పా ఇటాలియా, ఐఎల్‌టీ20 వంటి లైవ్ స్పోర్ట్స్ కంటెంట్‌ను కూడా అందిస్తూ తన ఎంటర్‌టైన్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తోంది. విభిన్న ఫార్మాట్లు, ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ కంటెంట్‌తో.. దక్షిణాది నుంచి అత్యుత్తమ వినోదాన్ని తెలుగు జీ5 అందిస్తోంది. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఏదో ఒక ప్రత్యేకమైన ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు జీ5లో సిద్ధంగా ఉంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments