దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ నుంచి రెండో సింగిల్ ‘లూజర్’ విడుదలైంది. జేక్స్ బిజోయ్ స్వరపరిచిన ఈ పాటను మలయాళంలో దుల్కర్ సల్మాన్ స్వయంగా ఆలపించారు. సుహైల్ కోయా సాహిత్యం అందించారు. మలయాళ వెర్షన్‌లో కె. బాలసరంగన్, జేక్స్ బిజోయ్ కూడా వోకల్ అందించారు.
ఈ పాటను మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. తమిళ, తెలుగు వెర్షన్లను బెన్నీ దయాల్ ఆలపించగా, విఘ్నేష్ రామకృష్ణ (తమిళ్), సనారే (తెలుగు) సాహిత్యం అందించారు. హిందీ వెర్షన్‌ను బెన్నీ దయాల్ పాడగా, నుమాన్ ఖోకర్ సాహిత్యం అందించారు. కన్నడ వెర్షన్‌లో సాయి మాధవ్ రెళ్ల వోకల్ అందించగా, హృదయ శివ సాహిత్యం రాశారు. ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది!!

