HomeEntertainmentకలియుగ సీతమ్మ శత జయంతి నేడు

కలియుగ సీతమ్మ శత జయంతి నేడు

- Advertisment -

తెలుగు చలనచిత్ర చరిత్రలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి అంజలి దేవి శత జయంతి నేడు. 1926 ఆగస్టు 24న జన్మించిన అంజలి దేవి, నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ తెలుగు సినిమాకు విశేష సేవలందించారు.
‘బాలరాజు’, ‘అనార్కలి’, ‘సువర్ణ సుందరి’, ‘లవకుశ’ వంటి ఎన్నో చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ముఖ్యంగా సీతాదేవిగా ఆమె అభినయం తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.


దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో విభిన్న పాత్రలకు జీవం పోసిన అంజలి దేవి, తెలుగు సినిమా చరిత్రలో ఒక స్వర్ణాధ్యాయంగా నిలిచిపోయారు. ఆమె శత జయంతి సందర్భంగా స్వాతిముత్యం ఘనంగా నివాళులర్పిస్తోంది!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments