HomeEntertainment‘కాకా’గా మెగాస్టార్…మెగా 158 టైటిల్ ఫిక్స్!

‘కాకా’గా మెగాస్టార్…మెగా 158 టైటిల్ ఫిక్స్!

- Advertisment -

మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రానికి టైటిల్ ఖరారైంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘కాకా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన గ్లింప్స్ మెగా అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ‘కాకా’పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. గ్లింప్స్‌లో మధ్యవయస్కుడైన కె. సత్యం పాత్రలో హుందాగా కనిపించిన చిరంజీవి, అనంతరం యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించడం విశేషంగా నిలిచింది. మాస్, యాక్షన్ అంశాలతో పాటు కథలో ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉన్నట్లు గ్లింప్స్ ద్వారా సంకేతాలు అందాయి.
వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. అనస్వర రాజన్, నివేథా పేతురాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే సుమారు 40 రోజుల షూటింగ్ పూర్తయి, తొలి భాగం ఎడిటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ‘కాకా’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెగాస్టార్‌ను మరోసారి తనదైన మాస్ అవతార్‌లో చూపించబోతున్న బాబీ కొల్లి… ‘వాల్తేరు వీరయ్య’ విజయాన్ని మించి ‘కాకా’తో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments