HomeEntertainmentమురళీ శర్మ ఓటీటీ ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ ‘సూపర్ సుబ్బు’తో ప్రేక్షకుల ముందుకు

మురళీ శర్మ ఓటీటీ ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ ‘సూపర్ సుబ్బు’తో ప్రేక్షకుల ముందుకు

- Advertisment -

జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న కామెడీ-డ్రామాలో కుక్కుటేశ్వరరావు పాత్రలో మురళీ శర్మ

మూడు దశాబ్దాలకుపైగా హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, మరాఠీ భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు మురళి శర్మ ఇప్పుడు తన తొలి ఓటీటీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ద్వారా ఆయన డిజిటల్ ప్రపంచంలో అడుగుపెడుతున్నారు.

ఈ సిరీస్‌లో మురళీ శర్మ కుక్కుటేశ్వరరావు అనే క్రమశిక్షణ, సంప్రదాయాలకు పెద్దపీట వేసే తండ్రి పాత్రలో కనిపించనున్నారు. అయితే తన కుమారుడు సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా మారాలనే నిర్ణయం తీసుకోవడంతో ఆయన నమ్మకాలు, ఆలోచనల్లో జరిగే మార్పుల చుట్టూ కథ సాగుతుంది. మాకిపూర్ అనే గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ హాస్యం, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో పాటు సమాజంలో సాధారణంగా మాట్లాడటానికి సంకోచించే అంశాలను హృద్యంగా ప్రస్తావిస్తుంది.

ఈ సందర్భంగా మురళీ శర్మ మాట్లాడుతూ, “ప్రేక్షకులను నవ్విస్తూ, అదే సమయంలో సాధారణంగా మాట్లాడటానికి ఇబ్బందిగా అనిపించే అంశాలపై ఆలోచింపజేసే కథ ఇది. హాస్యం, కుటుంబ భావోద్వేగాలు, సామాజిక అంశాలను ఎంతో సహజంగా మేళవించడం ఈ సిరీస్ ప్రత్యేకత. మాకిపూర్‌లోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్‌లో భాగం కావడం, అలాగే నా తొలి ఓటీటీ ప్రాజెక్ట్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఈ ప్రపంచాన్ని తప్పకుండా ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను” అన్నారు.

తాను ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చాననే విషయంపై ఆయన మాట్లాడుతూ, “‘టిల్లు స్క్వేర్’ చిత్రీకరణ సమయంలోనే దర్శకుడు మల్లిక్ ఈ కథ గురించి చెప్పాడు. ఆ సమయంలోనే ఈ పాత్రపై ఆసక్తి కలిగింది. తర్వాత పూర్తి కథ విన్నాక కుక్కుటేశ్వరరావు పాత్ర నాకు ఎంతో నచ్చింది. బయటకు కాస్త చిరాకు తెప్పించే, కఠినంగా కనిపించే వ్యక్తి అయినా, అదే పాత్రను ఎంతో ఆసక్తికరంగా మారుస్తుంది. ప్రేక్షకులు ఈ పాత్రను తప్పకుండా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను” అని తెలిపారు.

‘సూపర్ సుబ్బు’తో మురళీ శర్మ మరో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. హాస్యం, కుటుంబ భావోద్వేగాలు, వినోదంతో కూడిన ఈ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments