సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ ను ఎప్పటికప్పుడు కొత్తగా ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షోను మన ముందుకు తీసుకొస్తోంది. జూలై 3వ తేదీ నుంచి ఈ రియాలిటీ షో ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. మంచు లక్ష్మి, వైవా హర్ష, రశ్మి గౌతమ్ ఈ కార్యక్రమానికి జ్యూరీగా వ్యవహరించనున్నారు. విశ్వభారత్, ఫేమస్ రామ్, సింధు కసారం, అనిరుధ్ నారాయణం, రవి కిరణ్ బేవర, అఖిల్ జాక్సన్, డయానా, రవి, గౌతమ్ కుమార్, అమృత భూపతిరాజు, గ్రాండ్‌పా కిచెన్ టాప్ తెలుగు ఇన్ఫుయెన్సర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు!!

