HomeEntertainmentగాయపడ్డ సింహం ఘన విజయం తథ్యం

గాయపడ్డ సింహం ఘన విజయం తథ్యం

- Advertisment -

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నారా రోహిత్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు!!


నారా రోహిత్ మాట్లాడుతూ… ‘గాయపడ్డ సింహం’ టీమ్‌కి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నేను ఇక్కడికి రావడానికి కారణం విజయ్, పవన్. విజయ్‌తో నాకు చాలా కాలంగా అసోసియేషన్ ఉంది. అలాగే పవన్‌తో నేను నెక్స్ట్ సినిమా ఇదే బ్యానర్‌లో చేస్తున్నాను. కళ్యాణ్ గారు, భాను గారు, విజయ్ గారికి ఈ సినిమా ఒక మెమొరబుల్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మే 1న అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి” అన్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments