ప్రముఖ హాస్య నటులు మరియు మాజీ మంత్రివర్యులు బాబు మోహన్ గారి 74వ పుట్టిన రోజు పురస్కరించుకొని వారి 41 సంవత్సరాల సినీ జీవితాన్ని గుర్తు చేసుకొంటూ,మంగళవారం రాత్రి బేగంపేట లోని టూరిజం ప్లాజా లో ఇమ్మడి జ్యూయలర్స్ మరియు ఆర్.బి.ఎం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ డైరెక్టర్, ప్రొడ్యూసర్ నాగబాల సురేష్ గారి అధ్యక్షతన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ నుండి లెజెండరీ హాస్య నటులు పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య జాతీయ అవార్డు -2026 ను బాబు మోహన్ గారికి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఫౌండర్,CEO డాక్టర్ సత్యవోలు రాంబాబు మరియు కమిటీ సభ్యులు డాక్టర్ కిషోర్ కుమార్, పారిశ్రామికవేత్త జగ్గయ్య, ప్రముఖ న్యాయవాది రవి చరణ్ అంద చేనట్లు డాక్టర్ సత్యవోలు రాంబాబు తెలిపారు.
చిన్న ఉద్యోగి గా తన జీవితాన్ని ప్రారంభించి బాబు మోహన్ గారు తన 41సంవత్సరాల సినీ జీవితం లో రెండు వేలకు పైగా చిత్రాలలో నటించి తన హాస్యం తో విశ్వవ్యాప్తంగా తెలుగు ప్రజల హృదయాలను దోచుకొన్నారు. మాయలోడు సినిమాలో సౌందర్య లాంటి గొప్ప హీరోయిన్ తో చినుకు చినుకు అందెలతో … అనే సాంగ్ కు గొప్ప పేరు రావడమే కాకుండా కేవలం బాబూమోహన్ గారి వల్లే థియేటర్లలో 365రోజులు సినిమా ఆడి ప్రభంజనం సృష్టించింది.

హిట్లర్, మాయలోడు, రాజేంద్రుడు -గజేంద్రుడు, హలో బ్రదర్, మామగారు,జమ్బలికడి పంబ, పెదరాయుడు, అప్పుల అప్పారావు, ముగ్గురు మొనగాళ్లు, సాహస వీరుడు సాగర కన్య లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో వారి నటనకు అపూర్వ మన్ననలు లభించాయి.
విశ్వ విఖ్యాత నటులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి సారధ్యం లో బాబు మోహన్ గారు రాజకీయ ప్రవేశం చేసి, ఎం. ఎల్ . ఏ గా, మంత్రి గా ప్రజా సేవలో వారి మార్క్ ను ముద్రించారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు తనికెళ్ల భరణీ, ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ చలన చిత్ర దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వి. ఎన్. ఆదిత్య, ప్రముఖ చలన చిత్ర నిర్మాత అచ్చిరెడ్డి , ప్రముఖ చలన చిత్ర దర్శకులు కృష్ణారెడ్డి, ప్రముఖ సినీ పాత్రికేయులు ఎ. ప్రభు, నాగేంద్ర, ఇమ్మడి జ్యూయలర్స్ అధినేత ఇమ్మడి రమేష్, ఆర్. బి. ఏం ఫౌండర్ శివ ప్రసాద్, ప్రముఖ నటులు మిమిక్రీ కళాకారులు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

