▪️శుక్రవారం (ఏప్రిల్ 10న) తెలుగు రాష్ట్రాలలో “డైమండ్ డెకాయిట్” విడుదల
▪️ రిలీజ్ అయ్యే థియేటర్ లలో మహిళలకు 4 షోలు ఉచిత ప్రదర్శన
▪️ *కన్నీళ్లు ఆపలేని క్లైమాక్స్: డైరెక్టర్ సూర్య జి. యాదవ్
టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా “డైమండ్ డెకాయిట్” చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 10న) తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మహిళా ప్రేక్షకులకు ఆకర్షణీయమైన ఆఫర్ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల కానున్న థియేటర్లలో 4 షోలు మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. మహిళలు ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు వచ్చి సినిమాను ఆస్వాదించాలని చిత్ర బృందం కోరింది.
ఈ చిత్రంలో పార్ధా గోపాల్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరించగా, మేఘనా రెడ్డి హీరోయిన్గా నటించారు. రచయిత–దర్శకుడు సూర్య జి. యాదవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తి కుటుంబ వినోదంతో పాటు హృద్యమైన భావోద్వేగాలతో కూడిన ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా చూస్తే కన్నీళ్లు ఆపుకోవడం కష్టమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ మూవీ ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు ట్రైలర్ను వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారు. ఇప్పటికే నిర్వహించిన ప్రివ్యూ షోలలో పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సందర్భంగా హీరో–నిర్మాత పార్ధా గోపాల్ మాట్లాడుతూ:
“డైమండ్ డెకాయిట్ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ప్రతి కుటుంబం కనెక్ట్ అయ్యేలా కథ ఉంటుంది. కడపలో చిత్రీకరించిన అందమైన లొకేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహిళలకు 4 షోలు ఉచితంగా ఏర్పాటు చేశాం. అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలి” అని కోరారు.
దర్శకుడు సూర్య జి. యాదవ్ మాట్లాడుతూ: “33 ఏళ్ల క్రితం వచ్చిన మాతృదేవోభవ సినిమా ప్రేక్షకుల హృదయాలను ఎంతగా కదిలించిందో మనందరికీ తెలిసిందే. ఆ తరహా భావోద్వేగాన్ని మళ్లీ ఈ తరం ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నమే ‘డైమండ్ డాకోయిట్’.
ఇది కేవలం సినిమా కాదు… ప్రతి కుటుంబంలో ఉన్న ప్రేమ, బాధ, త్యాగం, అనుబంధాలను ప్రతిబింబించే ఒక నిజమైన అనుభూతి. ముఖ్యంగా క్లైమాక్స్ చూసిన తర్వాత ప్రేక్షకులు తమ భావోద్వేగాలను ఆపుకోలేరు అని నమ్ముతున్నాను.” అని అన్నారు.
ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే, 60కి పైగా అందమైన కడప జిల్లా లొకేషన్లలో పూర్తిగా చిత్రీకరించడం. ఈ విజువల్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నాయి.
కథనం, సహజమైన లొకేషన్లు, హృద్యమైన భావోద్వేగ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్ర బృందం తెలిపింది.
ఏప్రిల్ 10న విడుదలయ్యే ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి మహిళల కోసం ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ను వినియోగించుకోవాలని యూనిట్ ఆహ్వానిస్తోంది.

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సూర్య జి. యాదవ్
నిర్మాత, హీరో: పర్ధ గోపాల్
హీరోయిన్: మేఘన
చీఫ్ అడ్వైజర్, రైటర్: సాయి రాజు
సంగీతం: PR,
ఎడిటర్ శివ సర్వాణి,
సినిమాటోగ్రఫీ (DOP) శివ అచంట,
పీఆర్వో అశోక్ దయ్యాల

