గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ అంచనాలతో ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలవుతుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు మూడు సాంగ్స్, టీజర్ విడుదలయ్యాయి. మూడో సాంగ్ ‘నా నా హైరానా” 47 మిలియన్ వ్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. న్యూజిలాండ్‌లో 6 రోజుల పాటు ఈ పాటను ఇప్పటి వరకు ఎవరూ చిత్రీకరించని విధంగా రెడ్ ఇన్‌ఫ్రా కెమెరాతో చిత్రీకరించారు. ఒక్కో సన్నివేశం ఒక్కో పెయింటింగ్‌లా విజువల్ బ్యూటీగా మలిచారు శంకర్. ఈ పాట చిత్రీకరణకే రూ.10 కోట్లు ఖర్చు పెట్టారంటే మామూలు విషయం కాదు!!